న్యూడెమోక్రసీ నేత పూనెం లింగన్నకు ఘన నివాళులు

ఆలేరు, ఆంధ్రప్రభ: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు పూనెం లింగన్న ఏడో వర్ధంతి సందర్భంగా ఆలేరులో శుక్రవారం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు, పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన లింగన్న ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్. జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్. సీత, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చిరబోయిన రాజయ్యతో పాటు ప్రజా సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.