Operations | ‘కంటి వెలుగు’పై చైర్మన్ గుత్తా ప్రశంసలు

Operations | ‘కంటి వెలుగు’పై చైర్మన్ గుత్తా ప్రశంసలు

Operations | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ఆర్ఎంపీ లకు, పీఎంపీ లకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి ధృవపత్రాలు(Certificates) జారీ చేసే ప్రతిపాదన ఉందా అని బీఆర్ఎస్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రస్తావించారు. ఈ రోజు శాస‌న మండ‌లిలో ఆయ‌న‌ మాట్లాడారు.

ఈ క్రమంలోనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానం ఇస్తుండగా, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘కంటి వెలుగు(eye light)’ పథకంలో భాగంగా ఊరూరా క్యాంపులు పెట్టి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారని తెలిపారు. స్పాట్‌లో కంటి పరీక్ష నిర్వహించి, అందుబాటులో ఉన్న వారికి కళ్లజోళ్లు అక్కడే ఇచ్చేశారని తెలిపారు.

సరిపోయే కళ్లజోళ్లు లేని వారికి టైమ్ ఇచ్చి డైరెక్ట్‌గా ఇంటికే తీసుకెళ్లి ఇచ్చారని గుర్తు చేశారు. ఎవరికైతే కంటి ఆపరేషన్లు(operations) అవసరమో వారికి మాత్రం సీరియల్ ప్రకారం కొన్ని కంటి ఆసుపత్రులకు లింక్ చేసి చూపు వచ్చేలా చేశారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు.

Leave a Reply