Nallabelli | ఏపీ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

Nallabelli | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల కుల దేవత వాసవీ కన్యకా పరమేశ్వరి కొలువై ఉన్న పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండ అని నామకరణం చేసి అమలు పరచడం హర్షనీయమని ఆర్యవైశ్య సంఘం నల్లబెల్లి మండల అధ్యక్షుడు నీలా వెంకటేశ్వర్లు గుప్తా పేర్కొన్నారు.
ఈసందర్భంగా ఇవాళ ఆయన మాట్లాడుతూ… ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు అసెంబ్లీలో ఏకాభిప్రాయ తీర్మానం చేసి పెనుగొండ క్షేత్రాన్ని వాసవి పెనుగొండ పట్టణంగా పేర్కొంటూ అమలు పరచడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అక్కడి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలకు సహకరించిన మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు నల్లబెల్లి మండల ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

