RAJNATH SINGH | హైదరాబాద్‌లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన
RAJNATH SINGH | హైదరాబాద్‌లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన
ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు
RAJNATH SINGH | ఆంధ్రప్రభ, హైదరాబాద్: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటనకు చేరుకున్నారు. రెండు రోజులు ఆయన నగరంలోనే ఉండనున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ నాయకులు రాంచందర్‌రావు, జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తోపాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎన్డీయే ప్రభుత్వ పాలన పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్‌లో నిర్వహించిన ‘ప్రబుద్ధ వర్గ సమ్మేళన్’ (ఇంటలెక్చువల్ మీట్) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ కాంప్లెక్స్‌ను సందర్శించి అక్కడ ఒక నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి ఆయన ఎయిర్ ఫోర్స్ అకాడమీలోనే బస చేయనున్నారు. పర్యటన రెండో రోజు కేంద్ర మంత్రి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికార కేడెట్లకు అభినందనలు తెలియజేయనున్నారు. పరేడ్ కార్యక్రమం ముగిసిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. కేంద్ర రక్షణ మంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.
