Telangana PCC President | కేటీఆర్‌, హరీశ్‌రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న

Telangana PCC President | కేటీఆర్‌, హరీశ్‌రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న

Telangana PCC President | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీ చెప్పిందే మాట్లాడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణను కించపరిచేలా పవన్‌ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఎందుకు స్పందించడం లేదని మహేష్‌ గౌడ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలపై వారు మౌనం పాటించడం ఆశ్చర్యకరమన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసని పేర్కొన్న ఆయన, ఇప్పుడు రాష్ట్ర విభజన అంశంపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. విభజన గురించి మాట్లాడటం అంటే దానిని వ్యతిరేకించడమేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ అంశాన్ని వాడుకోవద్దని మహేష్‌ గౌడ్‌ సూచించారు.