513 votes | పల్కపల్లిలో సంతోష్ రెడ్డి ఘన విజయం

513 votes | పల్కపల్లిలో సంతోష్ రెడ్డి ఘన విజయం

513 votes | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండల పరిధిలోని పల్కపల్లి గ్రామ పంచాయతీ మూడవ విడత లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన వల్లపు సంతోష్ రెడ్డి భారీ మెజారిటీతో ఘన విజయం(Great success) సాధించారు. బుధవారం నిర్వహించిన పోలింగ్‌లో ఆయన తన సమీప ప్రత్యర్థి గుజ్జా సాయి రెడ్డిపై 513 ఓట్ల(513 votes) ఆధిక్యతతో గెలుపొందారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగగా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఓట్ల లెక్కింపు(counting votes) అనంతరం సంతోష్ రెడ్డి విజయం ఖరారుకాగానే గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు భారీగా పాల్గొని మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి(village development), మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. పల్కపల్లి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.