40th Ayyappa Maha Puja | జ‌న‌వ‌రి 1న అయ్యప్ప మహాపూజ

40th Ayyappa Maha Puja | జ‌న‌వ‌రి 1న అయ్యప్ప మహాపూజ

40th Ayyappa Maha Puja | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జనవరి 1న అయ్యప్ప స్వామి వారి 40 మహాపూజ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ దేవాలయం(Temple)లో మహా పూజ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళంపల్లి అనిల్ గురుస్వామి మాట్లాడుతూ.. జనవరి 1న అశోక్ గౌడ్ గురు స్వామి ఆధ్వర్యంలో 40వ అయ్యప్ప మహా పూజ(40th Ayyappa Maha Puja) వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం నుంచి శ్రీ అయ్యప్ప స్వామి మహా పూజ కలశ ఊరేగింపు ప్రారంభమవుతుందని తెలిపారు.

అనంతరం మహా పూజ వేడుకలు అశోక్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమ‌వుతాయని అన్నారు. సమావేశంలో గురుస్వాములు అశోక్ గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.