ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివిద్దాం – సర్పంచ్ వై నరసింహులు
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివిద్దాం – సర్పంచ్ వై నరసింహులు
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి.. గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సర్పంచ్ వై నరసింహలు అన్నారు. మన ఊరు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి పైకి రావాలని.. మన ఊరుకు మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వం మన పిల్లల చదువులకై లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది అన్నారు. రెండు జతల స్కూల్ యూనిఫామ్స్, ఉచిత బ్యాగు, పాఠ్య పుస్తకాలు, పాఠశాల అభివృద్ధి గురించి ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని, పిల్లల తల్లిదండ్రులు అది గుర్తించి పిల్లలను ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదవించాలి అన్నారు.
మన గ్రామంలోని అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుతున్నారని.. మన జిల్లాలో మన గ్రామం మొదటి స్థానంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్రారంభమైన శుభ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే గ్రామంలోని పిల్లలు చదవాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
