ఇందిరమ్మ కలల సహకారమే ప్రభుత్వ లక్ష్యం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ కలల సహకారమే ప్రజా పాలన లక్ష్యమని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిఅన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో నిర్మించుకున్న లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సోమవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరై దంపతులకు సాంప్రదాయ బద్దంగా చీరసారే అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేసి సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు.

ప్రజా పాలన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తే గ్రామాల్లో అర్హులైన వారికి విడుదలవారీగా ఇండ్లు మంజూరు చేస్తాననిఅన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పల్లెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అధికారులు ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం వేదికగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిషోర్ కుమార్,సర్పంచ్ త్రివేణిచెన్నప్ప, మండల అధ్యక్షులు యజ్ఞేశ్వర్ రెడ్డి మాజీ జెడ్పిటిసిలు సూర్యప్రకాశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి , మాజీ సర్పంచ్ పెద్ద సూరయ్య గౌడ్ , మాజీ ఎంపి టిసి రేణుక నరేష్ గ్రామ అధ్యక్షుడు ధన్వాడ బాలరాజ్, నాయకులు కార్యకర్తలు సుంకరి శ్రీను కుర్వ గజ్జలప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply