శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ: భారతదేశ సమైక్యత, జాతీయత, దేశభక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే సుమన్ బాయి రాథోడ్ అన్నారు.
సోమవారం ఉట్నూర్‌లోని తన నివాసంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుమన్ బాయి రాథోడ్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు సతీష్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలైన జాతీయవాద భావజాలానికి పునాది వేసిన ప్రముఖ నాయకుల్లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒకరని పేర్కొన్నారు.
దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ఐక్యత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. “ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు ప్రధానులు ఉండరాదు“ అనే ఆయన దృఢ సంకల్పం భారతదేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ దేశాభివృద్ధి, జాతీయ సమైక్యత, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బానోత్ జగన్ నాయక్, కాల్వ రవి, శేషారావు, రాంచందర్, జగన్, చింతల రమణ, విజయ్, గోపి, రమేష్, వేణు, పులి శ్రీకాంత్, దేవిదాస్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
