2to3years gap | ఇచ్చారా..? వచ్చిందా..?

2to3years gap | ఇచ్చారా..? వచ్చిందా..?
అల.. వైకుంఠపురములో.. అనే సినిమాలో.. ఓ సన్నివేశంలో.. తండ్రి పాత్ర.. మురళీశర్మ.. కొడుకు పాత్ర అల్లు అర్జున్ తో.. గ్యాప్ ఇచ్చావ్ అంటే.. గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అంతే అని చెబుతారు. ఇప్పుడు టాలీవుడ్ లో కొంత మంది దర్శకులు పరిస్థితి ఇలాగే ఉంది. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన తర్వాత కూడా కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చింది. ఇంతకీ.. బ్లాక్ బస్టర్ సాధించినా కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చిన దర్శకులు ఎవరు..? ఆ డైరెక్టర్స్ కొత్త సినిమా చేసేది ఎప్పుడు..?
2to3years gap | వంశీ పైడిపల్లి..

వంశీ పైడిపల్లి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకి రెండేళ్లు.. మూడేళ్లు.. గ్యాప్ తీసుకున్నారు. ఇలా గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటని అడిగితే.. గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అంతే.. అని చెబుతుంటారు. 2023లో తమిళ హీరో విజయ్ తో వారసుడు అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా రిలీజై రెండు సంవత్సరాలు అయ్యింది కానీ.. ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో వంశీ పైడిపల్లి సినిమా అని ప్రచారం జరిగింది కానీ.. సెట్ కాలేదు. ఇటీవల సల్మాన్ ఖాన్ తో వంశీ పైడిపల్లి మూవీ ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి కానీ.. ఇది కూడా సెట్ కాలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో వంశీ ఇంకెప్పుడు కొత్త సినిమాని ప్రకటిస్తాడు అనేది ఆసక్తిగా మారింది.
2to3years gap | కొరటాల శివ..

కొరటాల శివ.. సినిమాలకు కూడా గ్యాప్స్ వస్తూనే ఉన్నాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత ఆచార్య సినిమా చేయడానికి నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. దేవర సినిమా చేసి సంవత్సరం దాటేసింది కానీ.. ఇంత వరకు దేవర 2ని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. ఇటీవల దేవర 2 లేదని ప్రచారం ఊపందుకుంది. అందుకనే.. నాగచైతన్యతో కొరటాల ఓ భారీ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆమధ్య నాగచైతన్య, కొరటాల మధ్య కథాచర్చలు జరిగాయి కానీ.. ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యిందో లేదో క్లారిటీ లేదు. క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
2to3years gap | నాగ్ అశ్విన్..

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో.. కెరీర్ స్టార్ట్ చేసిన నాగ్ అశ్విన్ కు కూడా గ్యాప్ బాగానే వస్తుంది. 2015లో ఎవడే సుబ్రమణ్యం సినిమా తీస్తే.. మూడేళ్ల గ్యాప్ తర్వాత 2018లో రెండో సినిమా మహానటి తీసారు. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది. కీర్తి సురేష్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డ్ ను కూడా అందించింది. ఇక మూడో సినిమాకి ఏకంగా ఆరు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అవును.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2024లో రిలీజైంది. ఆతర్వాత సంవత్సరంన్నర అయ్యింది కానీ.. కల్కి 2 స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు.
2to3years gap | ప్రశాంత్ వర్మ..

అ అనే డిఫరెంట్ మూవీతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆతర్వాత రాజశేఖర్ తో కల్కి మూవీ తీస్తే.. ఆశించిన స్థాయిలో ఆడకపో్యినా ఫరవాలేదు అనిపించింది. జాంబీరెడ్డి, అద్భుతం, హనుమాన్ సినిమాలు తెరకెక్కిస్తే.. ఇందులో హనుమాన్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ స్టార్ సాధించింది. దీంతో ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. రణ్ వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ సినిమా చేయాలి కానీ.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. హనుమాన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్ చేయాలి కానీ.. ఇంత వరకు ఈ మూవీ పట్టాలెక్కలేదు. మోక్షజ్ఞతో సినిమాని ప్రకటించారు కానీ.. ఆతర్వాత ఆగిపోయింది. ఇలా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించినా కొత్త సినిమాని స్టార్ట్ చేయలేదు ప్రశాంత్ వర్మ.
2to3years gap | శౌర్యువ్..

శౌర్యువ్.. హాయ్ నాన్న సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఈ మూవీ రిలీజై రెండు సంవత్సరాలు అయ్యింది కానీ.. ఇంత వరకు శౌర్యువ్ కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. ఆమధ్య శౌర్యువ్ ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాగే రామ్ చరణ్ కోసం కూడా శౌర్యువ్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్టుగా టాక్ వినిపించింది కానీ.. ఇది కూడా నిజం కాదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇలా శౌర్యువ్ సక్సెస్ సాధించినా.. రెండో సినిమాని ఇంత వరకు స్టార్ట్ చేయలేదు.
2to3years gap | సాయి రాజేష్..

హృదయ కాలేయం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన సాయి రాజేష్.. తొలి ప్రయత్నంలోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాతోనే సంపూర్ణేష్ బాబును హీరోగా పరిచయం చేశారు. ఆతర్వాత కొబ్బరి మట్ట అనే సినిమా తీసి మరో సక్సెస్ సాధించారు. కలర్ ఫోటో మూవీకి కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. అక్కడ సక్సెస్ సాధించిన ఈ సినిమా జాతీయ అవార్డులు సైతం దక్కించుకుంది. ఆతర్వాత బేబీ అనే సినిమాతో తీస్తే.. అది కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ మూవీ 2023లో రిలీజైంది కానీ.. ఇంత వరకు సాయి రాజేష్ కొత్త సినిమా ప్రకటించలేదు.
2to3years gap | వివేక్ ఆత్రేయ..

మెంటల్ మదిలో అనే సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వివేక్ ఆత్రేయ..బ్రోచేవారెవరురా, అంటే.. సుందరానికీ, సరిపోదా శనివారం సినిమాలు తెరకెక్కించారు. సరిపోదా శనివారం మూవీ రిలీజై.. సంవత్సరం దాటేసింది కానీ.. ఇంత వరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసేందుకు వివేక్ ఆత్రేయ ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ కాలేదు. ఈ యంగ్ డైరెక్టర్ కూడా సక్సెస్ వచ్చినా.. కొత్త సినిమాను ఇంత వరకు అనౌన్స్ చేయలేదు. మరి.. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ న్యూయర్ లో అయినా సరే.. కొత్త సినిమా అప్ డేట్ ఇస్తారేమో చూడాలి.
