Toxic | మేకింగ్ వీడియోతో పెరిగిన అంచనాలు
Toxic | మేకింగ్ వీడియోతో పెరిగిన అంచనాలు
Toxic | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రాకింగ్ స్టార్ యష్. తన తదుపరి చిత్రం టాక్సిక్ తో మరో భారీ విజయం కోసం సిద్ధమతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఆమె పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన మేకింగ్ వీడియో టీజర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ మేకింగ్ గ్లింప్స్ కేవలం సినిమా ఎలా తీస్తున్నారో చూపించడమే కాకుండా, ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. యష్ లుక్, సినిమాటోగ్రఫీ, ఆ సెట్టింగ్స్ చూస్తుంటే, ఇది ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాను మించిన విజువల్ వండర్ అని అర్థమవుతోంది.
సినిమా మేకింగ్‌లో వినియోగించిన ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, డార్క్ థీమ్స్‌తో కనిపిస్తోంది. భారీ సెట్లు, హై-ఎండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు ప్రాణం పోస్తున్నాయి. ‘టాక్సిక్’ పేరుకు తగ్గట్టే, వీడియోలో ఒక రకమైన ఇంటెన్స్ అండ్ గ్రే షేడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ అండ్ డార్క్ స్టోరీ అని టీజర్ హింట్ ఇస్తోంది.
Toxic | ఫ్యాన్స్‌లో అంచనాలే అంచనాలు..
ఈ మేకింగ్ వీడియో చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. “కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి, కానీ ఈ మేకింగ్ చూస్తుంటే ఆ అంచనాలు సరిపోవనిపిస్తోంది” అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
