Farmer | రైతుల సంక్షేమానికి కేంద్ర ప‌థ‌కాలు

Farmer | రైతుల సంక్షేమానికి కేంద్ర ప‌థ‌కాలు

  • గ్రామాల్లో బీజేపీ జెండా ఎగురేస్తాం..
  • బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింత శరత్ కుమార్ రెడ్డి

Farmer | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింత శరత్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సామల ప్రకాష్ నాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.6వేలు నేరుగా ఖాతాలో జమ చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనద్వారా పంట నష్టపోయిన రైతులకు భీమా రక్షణ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC)పథకం అమలు చేస్తున్నారని, చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు ఈ పథకం ఉపయోగపడుతుంద‌న్నారు. అదేవిధంగా రైతుల పెన్షన్ భద్రత కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనద్వారా వృద్ధాప్యంలో నెలకు రూ.3వేల‌ పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, బీజేపీ సీనియర్ నాయకులు సామల కేశవ రెడ్డి, సురేందర్ రెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధిక్ భాష, జిల్లా మైనార్టీ అధ్యక్షులు దస్తగిరి, వేణుగోపాల్ రెడ్డి, చలపతి రెడ్డి, అశోకు, నందిశెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply