Retirement | ఘనంగా వీడ్కోలు..

Retirement | విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీస్ అధికారులకు శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మీయంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ఇతర ఉన్నతాధికారులతో కలిసి పదవీ విరమణ చేసిన అధికారులను పోలీస్ మర్యాదలతో శాలువాలు కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా డీసీపీ సరిత మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం చట్టాలకు అనుగుణంగా ప్రజాసేవకు తమ సమయం, శక్తిని అంకితం చేసి విశిష్ట సేవలందించినందుకు అభినందించారు. పోలీస్ శాఖలో అందరూ ఒకే కుటుంబ సభ్యులమని, విధి నిర్వహణలో చూపిన చిత్తశుద్ధి, అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలతో ఇప్పటివరకు 24 గంటలూ బిజీగా గడిపిన వారికి పదవీ విరమణ అనంతరం ఒక్కసారిగా ఖాళీ సమయం రావడం కష్టంగా అనిపిస్తుందని, అందువల్ల ఆధ్యాత్మికత వైపు మళ్లడమో లేదా ఏదైనా మంచి వ్యాపకం అలవాటు చేసుకోవాలని సూచించారు.

Retirement

ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన అధికారుల కుటుంబ సభ్యులను కూడా ఆమె ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ తరఫున వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పదవీ విరమణ పొందిన వారు: భవానీపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పి.ఎస్. ప్రకాష్ రావు, నాల్గవ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. నాగ సుబ్బారావు, కొత్తపేట పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస బాబ్జి, మహిళా హోం గార్డులు ఎం.వి.ఎన్. కుమారి, వి. చిన్ని, కె. శేషు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ సునీత, ఏఆర్ఎ అదనపు డీసీపీ కె. కోటేశ్వరరావు, ఏఆర్ఎ ఏసీపీ ప్రేమ్ కుమార్, ఆర్ఐలు శ్రీనివాసరావు, సురేష్ రెడ్డి, ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. సోమయ్య, అసోసియేషన్ సభ్యులు, సీపీఓ సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply