Brutal murder | దారుణ హత్య

Brutal murder | దారుణ హత్య

Brutal murder | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో వరుసగా హత్యలు జరగడం కలవరపెడుతున్నాయి. బాలాపూర్‌ పరిధిలోని రాయల్‌ కాలనీలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఓ యువకుడు దారుణంగా హతమవడం (Brutal murder) నగరంలో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది.

హైదరాబాద్‌లోని బాలాపూర్‌ (Balapur) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయల్‌ కాలనీలో ఉండే ముర్షీద్‌ అనే యువకుడిపై దుండగులు కత్తులతో దాడిచేశారు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తి అక్కడకక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు సంబంధించి ఆధారాలు సేకరణకు క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply