Droupadi Murmu | ఘన స్వాగతం..

Droupadi Murmu | ఘన స్వాగతం..
Droupadi Murmu, రేణిగుంట, ఆంధ్రప్రభ : భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. బుధవారం ఉదయం 10.30 గం. లకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో భారత రాష్ట్రపతికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్.హరి జవహర్ లాల్ ఎక్స్ అఫీషియో సెక్రెటరీ రెవెన్యూ (ఎండోమెంట్ ), డి ఐ జి అనంతపురం రేంజ్, షేమూసి, తిరుపతి జిల్లా ఇంచార్జి జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ జయకృష్ణ తదితరులు స్వాగతం పలికారు.
