CHECK | సీఎం సహాయ నిధి..

CHECK | సీఎం సహాయ నిధి..
- ఆర్థిక సంక్షోభంలో కూడా ఏడాదిన్నర కాలంలోనే 3.5 కోట్ల పంపిణీ..
- ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
- నందిగామలో 67 మంది లబ్ధిదారులకు 34.34 లక్షలు.
CHECK | నందిగామ, ఆంధ్రప్రభ : ఆర్థిక సంక్షోభాల మధ్య కూడా పేదల పరిస్థితులపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, ఏడాదిన్నర కాలంలోనే సీఎం సహాయ నిధి ద్వారా మూడున్నర కోట్ల రూపాయల చెక్కులను ప్రజలకు అందజేసింది. ఈ క్రమంలో శనివారం నందిగామ (Nandigama) పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను 67 మంది లబ్ధిదారులకు గాను 34,34,792 రూపాయలు నేరుగా అందజేశారు. కూటమి నేతలతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో జరిగింది. పేదలు, వికలాంగులు, వృద్ధులు, సామాన్య ప్రజలు తదితరులకు ఈ సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం తన సంక్షోభ నిర్వహణా సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది.

ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి ఉందని, ఆర్థిక కష్టాలు ఉన్నా, సీఎం (CM) సహాయ నిధి ద్వారా ప్రతి అవసరానికి సహాయం చేస్తాము అని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చెప్పారు. నందిగామ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఈ సహాయానికి సంతోషం వ్యక్తం చేస్తూ,కూటమి ప్రభుత్వానికి,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, కూటమి సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు,డీసీ చైర్మన్లు,స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ సంఘటన ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని మరింత పెంచినట్లుగా కనిపిస్తోంది.
