KCR | స్వరాష్ట్ర సాధనలో దీక్ష దివస్ అపూర్వ ఘటం…

KCR | స్వరాష్ట్ర సాధనలో దీక్ష దివస్ అపూర్వ ఘటం…

KCR | నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో దీక్ష దివస్(Initiation Day) అపూర్వ ఘట్టమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలతో అమరులకు ఈ రోజు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో(Telangana will come… KCR will do it)” అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్(KCR) ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష(hunger strike) ప్రారంభించిన రోజు ను దీక్ష దివస్‌గా పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అన్నారు. ప్రత్యేక తెలంగాణ కళ కలగానే మిగిలిపోతుందేమో అన్న సమయంలో, అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా, పదవులను గడ్డి పోస‌ల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర నినాదం(Swarashtra slogan) ఇంకా బలంగానే ఉందని అనేకసార్లు నిరూపించి త్యాగాలకు త్రొవ్వచూపిన తీరు చరిత్ర పుటల్లో పదిలమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply