AP | సిపీ స్టయిల్ ఛేజింగ్..

  • 105 కిలోల గంజాయి పట్టివేత

భామిని (కొత్తూరు), ఆంధ్రప్రభ : మన్యం పార్వతీపురం జిల్లా పాలకొండ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని భామిని మండలం బత్తిలి పోలీసులు (battili police) భారీ స్థాయిలో కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి ని శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు.తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ (inter state check post) బత్తిలి వద్ద స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఒడిశా వైపు నుంచి ఓ తెల్లటి కారు చెక్ పోస్ట్ వద్ద రాగా పోలీసులు అడ్డగించారు. కారు ఆపకుండా బైక్ ను ఢీ కొట్టారు. పోలీసులకు అనుమానం వచ్చి కారును వెంబడించారు. తమను తప్పించుకుని పారిపోతున్న కారును సినీ ఫక్కీ పోలీసులు వెంబడించారు. ఎట్టకేలకు కారును అడ్డుకున్నారు. ఈ కారులో ఇద్దరు కేరళ వ్యక్తులు, బ్రౌన్ కలర్ లో 53 గంజాయి ప్యాకెట్లను (53 ganja packets( పోలీసులు గుర్తించారు. శనివారం బత్తిలి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు ఈ కేసు వివరాలు తెలిపారు.

కేరళ , అలప్పుజ జిల్లా నేరియం పల్లి తరయిల్, వల్లికున్నం కి చెందిన ప్రతాప్ సింగ్ (29) (ఫైసల్), అలప్పుజ జిల్లా తెంగిన్ తరయిల్, ఎలిప్కుళం గ్రామం, పి.ఓ. కట్టనం, పల్లికల్, చెందిన నదీమ్ సునీల్ అబ్దుల్ వాహిద్ (33)ను అరెస్టు చేశారు. , ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా మునిగూడలోని ఓ వ్యక్తి పరిచయం కాగ… అతడి నుండి 53 పాకెట్ లో గంజాయిని రెండు లక్షల రూపాయలకు కొన్నారు.

బత్తిలి గ్రామం వెళ్ళి శ్రీకాకుళం హైవే ద్వారా వెళితే తక్కువ దూరం లో కేరళ లోని తమ గ్రామం చెరికోవచ్చు అని గంజాయి అమ్మిన వ్యక్తి ఇచ్చిన సలహాపై , ఒడిషా నుండి బత్తిలి చెక్ పోస్ట్ ద్వారా కేరళకు చేరుకుని గంజాయి విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అని అనుకొని, బత్తిలి చెక్ పోస్ట్ కు రాగా పోలీసులను తప్పించికునే క్రమం లో, బైకును ఢీ కొట్టారు, పోలీసులకు దొరికిపోయారు. ఃఈ కేసు చేధించిన పాలకొండ సీఐ ప్రసాద్, బత్తిలి ఎస్ ఐ జీ అప్పారావు , పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Leave a Reply