8:00 PM | 18జూన్2026 ముఖ్యాంశాలు..
8:00 PM | 18జూన్2026 ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ధరల సమస్యపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎగుమతులు తగ్గడం, మార్కెట్ డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు తగ్గాయని పేర్కొంటూ, రాబోయే 10 రోజుల్లో ధరలు మెరుగుపడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
——————————————
కర్నూలు జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆర్‌వైఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
——————————————
శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల రవీంద్ర సాగునీటి పథకం పనులను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించే ఈ ప్రాజెక్టు పూర్తైతే వేలాది ఎకరాలకు నీరందుతుందని తెలిపారు.
——————————————
శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాల్లో తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సూచించారు. జూన్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించి సవరణలు చేపట్టనున్నట్లు తెలిపారు.
——————————————
కదిరిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని యోగా ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. యువత యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
——————————————
జూన్ 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను సందర్శించి భూమిపూజ, బహిరంగ సభలో పాల్గొననున్నట్లు కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సీఎం పర్యటనకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
——————————————
ఉరవకొండ నియోజకవర్గంలోని రూపానాయక్ తండా గిరిజన రైతులకు జైకిసాన్ ఫౌండేషన్, ఏఆర్ఎస్ రేకులకుంట సంయుక్తంగా ఆధునిక సాగు పరికరాలు, సజ్జ విత్తనాలు పంపిణీ చేశాయి. గిరిజన రైతుల ఆదాయం, జీవనోపాధి మెరుగుపరచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
——————————————
రామగిరి మండలంలో నిర్వహించిన పెల్టైజేషన్ పీఎండీఎస్ కార్యక్రమంలో కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పాల్గొని ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ సాగు విధానం రైతులకు ఉపయోగకరమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు.
——————————————
రాప్తాడు మండలంలో ఎస్ఐఆర్-2026 ఇంటింటి సర్వేలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కొనసాగుతోందని తహసీల్దార్ చెన్నకేశవులు తెలిపారు. ఓటర్లు బీఎల్ఓలకు సహకరించి వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
CLICK HERE TO READ MORE : టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
