Warangal | 52 కోట్ల నిధులు ఏమైనట్లుల?

Warangal | 52 కోట్ల నిధులు ఏమైనట్లుల?
Warangal | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు గ్రామీణ ప్రాంతాల రోడ్లకు 52 కోట్ల రూపాయల నిధులు మంజూరైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి(Dr. Gogula Rana Pratap Reddy ఆరోపించారు. అధ్వానంగా మారిన నర్సంపేట రోడ్లపై గుంతలను వెంటనే పునర్మించాలని మాదన్నపేట రోడ్‌లో బీజేపీ నాయకులు ఈ రోఉ మహాధర్నా చేపట్టారు.
నర్సంపేట నియోజకవర్గం, పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మాదన్నపేట రోడ్డు(Madannapet Road) నుండి అనేక గ్రామీణ, రహదారులు పాడైపోయి, గుంతలు ఏర్పడి, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టి నిర్మించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు.
అమృత్ పథకం(Amruth Scheme) కింద 32 కోట్లు నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి వచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు కేటాయించి క్లీన్ సిటీగా ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తే 52 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి(State Council Member Vaddepalli) నరసింహారాములు ,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, పట్టణ, రూరల్ ప్రధాన కార్యదర్శులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
