రెండో స్థానంలో నంద్యాల..

రెండో స్థానంలో నంద్యాల..

నంద్యాల, ఆంధ్రప్రభ :  రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల మధ్య నంద్యాల మెప్మా కార్యాలయం ప్రతిష్టాత్మకంగా రెండవ స్థానం సాధించిందని మెప్మా పీడీ వెంకట దాస్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరులో పాటు,  మహిళా సంక్షేమమే ధ్యేయంగా పొదుపు సంఘాలే మహిళలే ఆర్థిక అభివృద్ధితో  సమాజంలో భరించ ముందుకు సాగాలని అందుకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఇచ్చిన ఆదేశాలు స్ఫూర్తితో అన్ని విభాగాల పనితీరు, లక్ష్యాల సాధన ( Achieving Goals)  స్త్రీ సంఘాల అభివృద్ధి, ఆర్థిక పారదర్శకత వంటి అన్ని పారామీటర్లలో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా ఈ ఘనత దక్కినట్టు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా స్థాయిలో సమష్టి కృషితో సిబ్బంది, కమ్యూనిటీ ఆర్గనైజర్లు( Community Organizers) . సిటీ మిషన్ మేనేజర్లు సీఆర్పీలు. అందరూ ఒక టీమ్‌లా పనిచేసినందుకు ఈ విజయం సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం నంద్యాల మెప్మాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ప్రథమ స్థానం సాధించేందుకు మరింత కృషి చేయాలని సిబ్బందికి పీడీ పిలుపునిచ్చారు. నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, సామాజిక బాధ్యతతో పనులు కొనసాగించాలని సూచించారు. నంద్యాల మెప్మా ( Nandyal Mepma)  రాష్ట్రస్థాయిలో విశేష గుర్తింపు పొందిన నేపథ్యంలో కార్యాలయానికి మరింత బాధ్యత పెరిగింది అన్నారు..

Leave a Reply