దేశ సైనికులను కించపరచడం సిగ్గుచేటు..

దేశ సైనికులను కించపరచడం సిగ్గుచేటు..
బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ(BJP) ఆధ్వర్యంలో దహనం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్(Uppari Ramesh) మాట్లాడుతూ.. ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్(Operation Sindhur పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భిక్కనూర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
దేశ సైనికులను, దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని ఈరోజు భారతదేశంలో దేశ సైనికులు ప్రాణాలకు తెగించి దేశ ప్రజల కోసం సరిహద్దులలో విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికుల పట్ల ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి(State Chief Minister) అయ్యుండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అత్తిలి తిరుమలేష్, పొన్నాల రంజిత్(Ponnala Ranjith), మండల ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నర్సింలు, జిల్లా నాయకుడు రవీందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
