ముగ్గురి దర్మరణం

ముగ్గురి దర్మరణం
సూర్యాపేట, రంగారెడ్డి, ఆంధ్రప్రభ : సూర్యాపేట(Suryapet), మేడ్చల్ జిల్లాల్లో జరిగే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం(Bandaramaram) వద్ద ఓ బైక్ అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్నసిమెంట్ దిమ్మె(cement block)ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్నఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులిద్దరూ తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన వేముల నాగరాజు(26), వేముల కార్తీక్(24)గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన నాగరాజు హైదరాబాద్(Hyderabad)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట(Suryapet) ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. ఈ దుర్ఘటనతో రెండు కుటుంబాల్లో పండగ పూట విషాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో ఇద్దరు మరణించారని తెలియడంతో మాలిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మేడ్చల్ జిల్లా(Medchal District) మనోహరబాద్ మండలం పోతారాం గ్రామానికి చెందిన బడికోలు అజయ్ రెడ్డి(Ajay Reddy) (23) పండుగ నిమిత్తం గురువారం(Thursday) రాత్రి సొంత గ్రామానికి బైక్ పై వస్తుండగా అత్వెల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్నకుటుంబులు గ్రామస్థులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగారు.
