Venkanna | స్వామికి మొక్కులు..

Venkanna | స్వామికి మొక్కులు..
- తెలంగాణ వెంకన్న ఆలయంలో భక్తుల పూజలు
Venkanna | కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బిచ్కుంద మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తరు శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
