కూలిన కొబ్బరి చెట్లు

కూలిన కొబ్బరి చెట్లు

  • విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం


ఆంధ్రప్రభ, సోంపేట (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా సోంపేట మండలం గొల్లగండి పంచాయతీలో భారీ వర్షంతో కొబ్బరి చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. గురువారం ఉదయం నుండి సోంపేట మండల (Sompet Mandal) పరిధిలో ఎడతెరపి లేకుండా గాలులు మితిమీరిన వేగంతో వీచాయి. వర్షం దంచి కొట్టింది. ఫలితంగా గొల్లగండి పంచాయతీ తో పాటుగా పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై అనేక కొబ్బరి చెట్లు విరిగి రహదారిపై పడిపోయాయి.

ప్రజలు రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ తీగల (Electrical wires)పై చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా గ్రామాల్లోని పెద్దలు, యువకులు చెట్ల తొలగింపునకు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ భారీ కొమ్మలు, తీగల కారణంగా పనులు సాగటం లేదు. విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు.

Leave a Reply