బాధ్యతను అమలు పరచండి..
- అమ్మ దయ పొందండి
- గూగుల్ మ్యాప్స్ సహాయంతో విధుల నిర్వహణపై
- అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ దిశా నిర్ధేశం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దసరా మహోత్సవాల విధుల నిర్వహణలో ముందుగా అప్పగించిన బాధ్యతలను సరైన విధంగా అర్థంచేసుకొని క్షేత్ర స్థాయిలో అమలుచేయడం ద్వారా సామాన్య ప్రజల(Common people)కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించి.. అమ్మ దయ పొందాలని.. అప్పుడే విధుల నిర్వహణకు సార్థకత లభిస్తుందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ(Collector Dr. G. Lakshmi) అన్నారు.
శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దసరా మహోత్సవాల విధుల నిర్వహణపై జిల్లా అధికారులకు(District officials) ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి సెక్టార్ లోను జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యం, వీఎంసీ.. ఇలా వివిధ శాఖల సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారని తెలిపారు.
ప్రతి అధికారికి ఆ సెక్టార్(Sector) గురించి స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. ఆయా సెక్టార్లలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారమివ్వాలని.. యుద్ధప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చొరవచూపాలన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో సమన్వయం పరంగా ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. అయిదు నిమిషాల ముందే డ్యూటీ పాయింట్‌కు(Duty Point) చేరుకొని ముందు షిఫ్ట్ ఆఫీసర్‌ను రిలీవ్ చేయాలన్నారు.
ఆయా సెక్టార్లపై సెక్టార్ ఇన్ఛార్జ్లకు, సిబ్బందికి స్పష్టమైన మైండ్ మ్యాప్‌తో అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా అత్యవసర ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆయా సెక్టార్ల(Sectors)లో అనుమానాస్పద, ఉత్సవాలకు విఘాతం కలిగించే పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వృద్ధులు, మహిళలు, గర్బిణీలు, బాలింతలు, చిన్నారులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం లభించేలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకునేలా చూడాలన్నారు. వారికి అవసరమైన సహాయసహకారాలు అందించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
దృష్టిసారించాల్సిన అంశాలు..
సెక్టార్ బాధ్యతలు చూస్తున్న ఇన్‌ఛార్జులు, సిబ్బంది ముఖ్యంగా భక్తుల భద్రత, సురక్షిత తాగునీరు, శుభ్రమైన ఆహారం(Clean Food), ఆహ్లాదకర పరిసరాలు, సురక్షిత క్యూలైన్లు, మహిళల భద్రత, చిన్నారుల భద్రత, సూచిక బోర్డులు, సమాచార బోర్డులు, పబ్లిక్ అనౌన్స్మెంట్, మతసామరస్యాన్ని ప్రోత్సహించడం వంటివాటిపై దృష్టిసారించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
ఎప్పటికప్పుడు భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఫీడ్ బ్యాక్( Feedback) తీసుకోవాలని.. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఏవైనా సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉంటే వెంటనే చక్కదిద్దాలన్నారు. ప్రతి సెక్టార్‌కూ ఆ ప్రాంత పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులకు ఇబ్బందిలేకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. మైకు, ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్(QR code), అత్యవసర ఫోన్ నంబర్లు, పార్కింగ్ స్థలాల జాబితా, వీఐపీ బోర్డింగ్ ప్రాంతాల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
… భక్తుల భద్రతే ముఖ్యం…
భక్తుల క్షేమం, భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ ఎస్వీ రాజశేఖరబాబు(CP SV Rajasekharababu) సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని సీపీ రాజశేఖరబాబు పేర్కొన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ(Collector S. Ilakkiya,), మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి పాల్గొన్నారు.

