delhi | మోదీ పిలుపుతో ఇంధన పొదుపుకు సరికొత్త బాట

delhi | మోదీ పిలుపుతో ఇంధన పొదుపుకు సరికొత్త బాట

delhi | సైకిల్‌పై కోర్టుకు వెళ్లిన హైకోర్టు న్యాయమూర్తి
మెట్రో, ఈ-రిక్షాలో ప్రయాణించిన ఢిల్లీ మంత్రి
ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపుకు స్పందన
ప్రజా రవాణాతో ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖులు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌ : దేశవ్యాప్తంగా ఇంధనాన్ని పొదుపు చేయాలనే సందేశం గట్టిగా వినిసిస్తుంది. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు స్వయంగా రంగంలోకి దిగి సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి, విలాసవంతమైన అధికారిక వాహనాలను పక్కన పెట్టి సామాన్యుల బాటలో నడుస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి పిలుపును స్ఫూర్తిగా తీసుకున్న ఢిల్లీ మంత్రి ఆశిష్ సూద్ , మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ద్వారకా దీశ్‌ బన్సల్ తమ చర్యల ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

delhi | సైకిల్‌పై కోర్టుకు న్యాయమూర్తి..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపును మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకా దీశ్‌ బన్సల్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఇంధనాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో ఆయన తన అధికారిక వాహనాన్ని పక్కన పెట్టారు. తన నివాసం నుండి కోర్టు వరకు ఉన్న సుమారు 3 కిలోమీటర్ల దూరాన్ని ఆయన సైకిల్‌పైనే ప్రయాణించి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ బన్సల్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో న్యాయ వర్గాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.

delhi | మెట్రో, ఈ-రిక్షాలో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి

మరోవైపు, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ కూడా తన నిరాడంబరతతో ఆదర్శంగా నిలిచారు. ప్రధాని పిలుపునిచ్చిన పొదుపు చర్యల్లో భాగంగా ఆయన ప్రజా రవాణా వ్యవస్థను ఎంచుకున్నారు. సూరజ్‌మల్ విహార్‌లోని సి.ఎం. శ్రీ పాఠశాలలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల కీలక సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. మెట్రో స్టేషన్ నుండి పాఠశాల వరకు చేరుకోవడానికి ఆయన ఈ-రిక్షాను వినియోగించారు. సాధారణంగా మంత్రులు భారీ కాన్వాయ్‌లతో వెళ్లే క్రమంలో, ఆశిష్ సూద్ ఇలా సామాన్యుడిలా ప్రయాణించడం చర్చనీయాంశమైంది.

CLICK HERE TO READ Vijay in2days | మొద‌టి దెబ్బ వైన్ షాపుల‌పైనే..

CLICK HERE TO READ MORE