ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా రిజ్వాన్
మండలంలోని ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కెరమెరి, ఆంధ్రప్రభ : నూతన ఉప సర్పంచుల ఫోరం కెరమెరి మండల కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం మండల అధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ రిజ్వాన్ ఎన్నికయ్యారు.
కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా పతంగే లింబదాస్, ప్రధాన కార్యదర్శిగా సూర్యావంశీ పరమేశ్వర్, సంయుక్త కార్యదర్శిగా మొహార్లే మోహన్, కోశాధికారిగా వాగ్మరే శ్రీకాంత్ ఎన్నికయ్యారు. సభ్యులుగా మడవి తుకారాం, బాంనే సాగర్, జాదవ్ దిలీప్, ఆత్రం బారికరావు, మొహార్లే రాందాస్‌లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ రిజ్వాన్ మాట్లాడుతూ మండలంలోని ఉప సర్పంచ్‌లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ఉప సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు.
ఉప సర్పంచ్‌లకు ప్రభుత్వ పరంగా రావాల్సిన గుర్తింపు, అధికారాల కోసం ఫోరం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులను ప్రజాప్రతినిధులు, నాయకులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు అబ్దుల్ కలాం, పెందోర్ మోతిరాం, కెరమెరి సర్పంచ్ పెందోర్ ఆనందరావు, ఇందాపూర్ సర్పంచ్ బుచ్చయ్య, నాయకులు ఆత్రం రాము, షేక్ మున్ను, ఆడ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
