మత్స్యకారుల సంక్షేమానికి రూ.116 కోట్ల కేటాయింపు స్వాగతం
రాష్ట్ర మత్స్యశాఖ మంత్రికి జిల్లా మత్స్యకారుల కృతజ్ఞతలు
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్ల నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా మత్స్యకారులు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ గోనెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.
ఈ సందర్భంగా గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి రూ.116 కోట్ల బడ్జెట్ కేటాయించడం హర్షణీయమని అన్నారు. ఈ నిర్ణయం మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంటూ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి జిల్లా మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి దోమ పరమేశ్వర్, కొనగట్టుపల్లి గ్రామ మత్స్య సహకార సంఘం కార్యదర్శి బాలగోపి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
