may20chintana | అదృష్టాన్ని ప్రసాదించే అలంపురం నవబ్రహ్మ దేవాలయాల మహిమ

may20chintana | అదృష్టాన్ని ప్రసాదించే అలంపురం నవబ్రహ్మ దేవాలయాల మహిమ

may20chintana | అలంపురంలో కొలువై ఉన్న నవబ్రహ్మల విశిష్టత
రససిద్ధుడు ప్రతిష్ఠించిన నవబ్రహ్మ ఆలయాలు
బ్రహ్మ పేరుతో లింగాలను ప్రతిష్ఠించిన పురాణ గాథ
జోగులాంబ శక్తి పీఠంలో ఆధ్యాత్మిక వైభవం
నవబ్రహ్మ దర్శనంతో మానసిక ప్రశాంతత, అదృష్టం

may20chintana | అదృష్టాన్ని ప్రసాదించే నవ బ్రహ్మలు

may20chintana | సృష్టి క్రమంలో తనకు సహాయంగా ఉంటారని, బ్రహ్మ తన శరీరంనుంచి కొంతమందిని సృష్టించాడు. వారే నారదుడు, సనకసనందులు, మను, మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్టుడు, వామదేవుడు మొదలగువారు. అయితే, వారిలో “మేము సృష్టి కార్యంలో పాల్గొనము. మాకు ఆత్మజ్ఞానం కావాలి. తపస్సుకై వెళ్ళిపోతున్నాము” అంటూ నారదుడు, సనకసనందులు, మను వంటివారు వెళ్ళిపోగా, మిగిలిన తొమ్మిది మంది సృష్టి కార్యంలో సహకరించారు. అందువల్లనే వారిని నవబ్రహ్మలు అంటారని పురాణాలు చెబుతున్నాయి. కానీ, ప్రముఖ శక్తి పీఠమైన అలంపురంలో కొలువై ఉన్న జోగులాంబ ఆలయం ప్రాంగణంలో ‘నవబ్రహ్మలు’ కొలువై ఉన్నారు. మరి ఈ నవబ్రహ్మలు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు? వారి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

may20chintana
may20chintana

అలంపురం శక్తి పీఠంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారని చెప్పుకున్నాము కదా. వాటి స్థాపనకు కారకుడైన వారు “రస సిద్ధుడు”. కాశీ పుణ్యక్షేత్రంలో ఒక వితంతువు తనకు పుత్రుడు కలగాలని, అక్కడ కొలువై ఉన్న విశ్వేశ్వర స్వామిని గురించి తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై ఆమె కోరిక తెలుసుకొని, “నీకు ఒక కారణ జన్ముడు పుడతాడు. వాడు నా భక్తుడై జీవిస్తాడు” అని వరం ఇచ్చారు. తరువాత ఈశ్వర కృపవల్ల ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, శక్తి పీఠం అలంపురం వెళ్ళి, బ్రహ్మ పేరు మీద లింగాలను ప్రతిష్ఠించమని, “రసవిద్య”ను ప్రసాదించాడు. దాంతో రసశిద్ధుడుగా పేరు పొంది, అలంపురం వచ్చి బ్రహ్మసూత్రం ఆధారంగా నవబ్రహ్మ ఆలయాలు ప్రతిష్ఠించాడు.

ఆ ఆలయాలే..

  1. బాల బ్రహ్మేశ్వర లింగం
  2. అర్క బ్రహ్మేశ్వర లింగం
  3. కుమార బ్రహ్మేశ్వర లింగం
  4. వీరబ్రహ్మేశ్వర లింగం
  5. విశ్వ బ్రహ్మేశ్వర లింగం
  6. స్వర్గ బ్రహ్మేశ్వర లింగం
  7. పద్మ బ్రహ్మేశ్వర లింగం
  8. తారక బ్రహ్మేశ్వర లింగం
  9. గరుడ బ్రహ్మేశ్వర లింగం

బ్రహ్మ పేరుతో లింగాలను ప్రతిష్ఠించమని శివుడు ఎందుకన్నాడంటే దానికీ ఒక కథవుంది. ఒకసారి బ్రహ్మ శివుడు గురించి ఘోరమైన తపస్సు తుంగభద్రా నది ఒడ్డున చేశాడని, శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడని పురాణ గాథలు చెబుతున్నాయి. “సృష్టి కర్త అయిన నాకు నీ శాపం వల్లనే పూజాదికాలు, ఆలయాలు లేవు. సృష్టి కర్తలలో మీ ఇద్దరికీ ఉన్నాయి. అందుకే నన్ను కూడా మానవులు ఆరాధించే వరం ఇవ్వండి” అని బ్రహ్మ కోరాడట. అందుకే బ్రహ్మ పేరుతో నవబ్రహ్మ ఆలయాలు వెలిశాయని పెద్దలు చెబుతారు.

అంతేకాకుండా, బ్రహ్మకు, పరమాత్మకు తేడా ఏమీలేదని… అంతా ఒక్కటేనని… అదే పరబ్రహ్మ స్వరూపం అని చాటి చెప్పడానికే ఈ ఆలయాలు నిర్మించబడ్డాయని విశ్వసిస్తారు.

బ్రహ్మకి ప్రపంచంలోనే వేళ్ల మీద లెక్కించే దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో రాజస్థాన్‌లోని పుష్కర్ ప్రాంతంలో బ్రహ్మ దేవాలయం ప్రసిద్ధి చెందగా, మరల శక్తి పీఠమైన అలంపురంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నవబ్రహ్మ దేవాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవి 7వ శతాబ్దం తొలి రోజుల్లో చాళుక్య రాజు బాదామి ప్రతిష్ఠించినట్లు, తరువాత వచ్చిన పాలకులు సంరక్షిస్తూ వచ్చినట్లు సమాచారం.

ఈ నవబ్రహ్మ దేవాలయాలను దర్శిస్తే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి, అదృష్టం కలుగుతాయని భక్తుల విశ్వాసం. దర్శనానంతరం కొంతకాలానికి సమస్యలు తొలగి, జీవితం సాఫీగా మారుతుందని అనేక మంది నమ్ముతారు. ఇటువంటి శక్తి మహిమాన్వితమైన జోగులాంబ శక్తి పీఠాన్ని, నవబ్రహ్మ ఆలయాలను ఒక్కసారి దర్శించడం ద్వారా ముక్తిని, దైవానుగ్రహాన్ని పొందవచ్చని భక్తులు చెబుతున్నారు.

-అనంతాత్మకుల రంగారావు

click here to read more

click here to read నమో గంగమ్మ తల్లీ

ఏపీ సీఎం దంపతుల ప్రణామం

Leave a Reply