గవి మఠం సంస్థానం సహాయ కమిషనర్‌గా బోయపాటి సుధారాణి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండలోని గవి మఠం సంస్థానం నూతన సహాయ కమిషనర్ అండ్ మేనేజర్‌గా బోయపాటి సుధారాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

గతంలో గవి మఠం సంస్థానం సహాయ కమిషనర్ అండ్ మేనేజర్‌గా పనిచేసిన గంజి మల్లికార్జున ప్రసాద్ గత నెలలో అనంతపురం దేవాదాయ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన స్థానంలో బోయపాటి సుధారాణిని నియమించారు.

బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గవి మఠం సంస్థానం అధికారులు, సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.