సంత మల్లన్న స్వామి మండల దీక్ష ప్రారంభం

వేల్పూర్, ఆంధ్రప్రభ: వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో సంత మల్లన్న స్వామి మండల దీక్ష ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.

స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పసుపు వస్త్రాలు ధరించి మండల దీక్షను స్వీకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు.

మండల దీక్షను 48 రోజుల పాటు నియమ నిష్టలతో కొనసాగించి, చివరి రోజున స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

దీక్షా కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.