జుక్కల్ సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా చాకలి కృష్ణ

జుక్కల్ సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా చాకలి కృష్ణ
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ:
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మికాంతారావు ఆదేశాల మేరకు గురువారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల సర్పంచుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా చాకలి కృష్ణను, ఉపాధ్యక్షునిగా చిన్నగుల్లా గ్రామ సర్పంచ్ జ్ఞానేశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ దేశాయ్, జుక్కల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ పటేల్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు చాకలి కృష్ణ, ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌లను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
అనంతరం సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు చాకలి కృష్ణ, జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. మండలంలోని సర్పంచులందరితో ఎల్లప్పుడూ సమన్వయం, సత్సంబంధాలు కలిగి ఉంటామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు సహకారంతో జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, మెరుగైన రవాణా సౌకర్యాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండలంలోని సర్పంచులందరికీ వారు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

