రాష్ట్ర ఆర్యవైశ్య అద్యక్షుడిని కలిసిన కామారెడ్డి ప్రతినిధులు
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తాను కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కైలాస శ్రీనివాస్ రావు, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్, శెనిశెట్టి గౌరీశంకర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర్ల లింగం, శెనిశెట్టి శ్రీనివాస్, కొండ బైరెయ్య గారు, గోవింద్ భాస్కర్, వలపిశెట్టి లక్ష్మీరాజం, అతిమాముల రమేష్, గజవాడ నాగరాజు, దానరపు రాజలింగం, ఉప్పల హరిధర్, ముప్పారపు ఆనంద్, వలపిశెట్టి భాస్కర్, శ్రీకాంత్ తదితర ఆర్యవైశ్య మిత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షునికి ఘనంగా శాలువాతో సన్మానం చేసినట్లు తెలిపారు. అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ పట్టణ సంఘం తరపున ప్రత్యేకంగా సత్కరించి, అమ్మవారి జయంతి వేడుకలకు ఆహ్వానించినట్లు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్యవైశ్యుల అభివృద్ధి, సమాజ సేవ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించినట్లు వివరించారు.
