లష్కర్ బోనాల విందులో సీఎం రేవంత్

  • మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో నేతల సందడి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరై బోనాల పండుగ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందు ఆత్మీయ వాతావరణంలో జరిగింది.