Fearful Pakistan | భయపడుతున్న పాకిస్థాన్!

Fearful Pakistan | భయపడుతున్న పాకిస్థాన్!

వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అప్గానిస్థాన్‌లో తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి పాకిస్తాన్(Pakistan) భ‌య‌ప‌డుతోంది. 2021 ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబ‌న్లు అధికారం చేపట్టారు. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణతో దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2021లో అమెరికా బలగాలు ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్లు అప్గానిస్థాన్‌(Taliban Afghanistan) ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తాలిబన్లు “ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్” పేరుతో ప్రభుత్వాన్ని ప్రకటించి, మౌలావి హిబతుల్లా అఖుంద్జాదాను సుప్రీం లీడర్‌గా నియమించారు. షరియా చట్టం(Sharia law) ఆధారంగా పాలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్‌లో తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) రెచ్చిపోతోంది. కొత్త ఏడాది(new year)లో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించేలా ప్రణాళికలు చేసింది. ఇందులో భాగంగానే పాక్ సైన్యానికి పోటీగా వైమానిక దళం ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో(On social media) పలు పోస్టులు చేసింది. ఈ వార్త పాక్ అధికారులను వ‌ణుకు పుట్టిస్తోంది. 2026లో ఈ వైమానిక దళం ఏర్పాటు చేస్తామని టీటీపీ ఓ ప్రకటనలో పేర్కొంది.

సలీం హక్కానీ నాయకత్వంలో దీన్ని నడపనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ప్రావిన్స్ల వారీగా(By province) మోహరింపులు, మిలిటరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మిలిటరీ కమాండర్లలతో కూడిన రెండు కొత్త పర్యవేక్షణ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్తో సహా మరికొన్ని ప్రావిన్స్లను తమ ఆధీనంలోకి తీసుకోవాలని(To take possession of) ప్లాన్ చేస్తోంది. మిలిటరీ యూనిట్లలో నాయకత్వ మార్పులు కూడా చేపట్టింది.

2022 నవంబరులో పాక్ ప్రభుత్వం(Pakistan Govt)తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని టీటీపీ ముగించింది. ఆ తర్వాత నుంచి పాక్ భద్రత దళాలు, పోలీసులు, అధికారులపై టీటీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా ఖైబర్ పబ్లుంఖ్వా, బలోచిస్థాన్ ప్రావిన్స్లలలో కార్యకలాపాలు విస్తరించింది. అఫ్గానిస్థాన్ భూభాగం నుంచి టీటీపీ ఉగ్రదాడులకు(TTP terrorist attacks) పాల్పడుతుందని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీన్ని తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఖండిస్తోంది.

click here to read భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు

click here to read more

Leave a Reply