నిజామాబాద్ ప్రతినిధి, మే 19(ఆంధ్రప్రభ) : ఆపరేషన్ సింధూర్ లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశాన్ని కాపాడిన సైనికుల వెంటే… మేము అంటూ ఇందూర్ ప్రజలు…. దేశ ప్రజలందరూ ఒక్కటై సైనికుల వెంట నిలవడటం గర్వంగా ఉందనీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల ప్రాణాలను తీసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన సైనికులు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
“ఆపరేషన్ సిందూర్ విజయం” త్రివిధ దళాల సేవలకు కృతజ్ఞతగా సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో మేము సైతం దేశం కోసం అనే నినాదంతో సోమవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని శివాజి చౌక్ ఆర్.ఆర్. చౌరస్తా వద్ద తిరంగా యాత్ర కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, బిజెపి సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ, బిజెపి మాజీ ఫ్లవర్ లీడర్ స్రవంతి రెడ్డి, హిందూ సంఘాల అధ్యక్షులు నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భరతమాత వేషధారణలో.. సైనికుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదేవిధంగా భారీ భరతమాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.