పశ్చిమలో అందుబాటు ధరలకు నాణ్యమైన బియ్యం

  • విక్రయాలు ఆదివారం నుండి ప్రారంభం
  • భవానిపురం రైతుబజార్‌లో ప్రత్యేక కౌంటర్ ప
  • ప్రారంభించిన తహసీల్దార్ షేక్ ఇస్మాయిల్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
  • బియ్యం ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వ చర్య

( భవానిపురం, ఆంధ్రప్రభ) : బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక విక్రయాల కార్యక్రమం ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం రైతుబజార్‌లో ప్రారంభమైంది. పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాల కార్యక్రమంలో భాగంగా భవానిపురం రైతుబజార్‌లో ప్రత్యేక కౌంటర్‌ను పశ్చిమ తహసీల్దార్ షేక్ ఇస్మాయిల్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ప్రారంభించారు.

బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పి. శ్రీనివాస్, వీఆర్వో మల్లికార్జునరావు, ఎస్టేట్ ఆఫీసర్ కరుణాకర్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, 42వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు, కూటమి నాయకులు బ్రహ్మారెడ్డి, బోయపాటి శ్రీనివాసరావు, బొల్లిగర్ల వెంకట్రావు యాదవ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.