అకాల వర్షం నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయండి..

అకాల వర్షం నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయండి..

నూర్పిడి చేసి కల్లాలలో గా ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించండి
రైతులకు అండగా నిలబడండి
రెవెన్యూ వ్యవసాయ పౌరసరఫరా
అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలి
రైతులకు అవసరమైన గోనె సంచులు పట్టాలు సరఫరా చేయాలి.
అధికారుల అలసత్వ తో రైతులకు నష్టం జరగకూడదు .
జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ : అకాల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేసి నూర్పిడి చేసి కల్లాలలో గా ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. అకాల వర్షం హెచ్చరికతో రైతులను అప్రమత్తం చేసేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎస్ ఇలాక్కియా లు రెవెన్యూ వ్యవసాయ సివిల్ సప్లై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం లో మార్పు కారణంగా జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు.అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వరి కోతకోసి నూర్పిడి చేసి కల్లాలలో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యం గా తిరువూరు గంపలగూడెం ఎ.కొండూరు జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు విజయవాడ రూరల్ మండలాల రెవెన్యూ వ్యవసాయ పౌరసరఫరా అధికారులు క్షేత్ర స్థాయిలోనే రైతులకు అందుబాటులో ఉండాలి ఆదేశించారు.

రైతులకు అవసరమైన గోనె సంచులు పట్టాలు సరఫరా చేయాలన్నారు అధికారుల అలసత్వ తో ఏ ఒక్క రైతుకు నష్టం జరగకూడదు అని అన్నారు. రైస్ మిల్లులకు తరలించిన ధాన్యం వెంటనే దిగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.ధాన్యాన్ని తరలించేదుకు అవసరమైన వాహనాలను లారీ యజమానుల సంఘం ప్రతినిధుల మాట్లాడి సమకూర్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాత్రికి రాత్రి ధాన్యం మిల్లులకు తరలించేదుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయాధికారిణి డి ఎం ఎఫ్ విజయకుమారి సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి.సతీష్ విజయవాడ నందిగామ తిరువూరు ఆర్ డి ఓ లు రజనీకుమారి, కె.పోసిబాబు ,కుమార్ జిల్లా లోని మండల వ్యవసాయాధికారులు తసీల్ధారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply