డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న సర్పంచ్, గ్రామ పటేల్

పంచాయతీలో మౌలిక వసతుల కల్పనకు కృషి

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పుల్లార గ్రామపంచాయతీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ వెడ్మ జంగుబాయి తెలిపారు.

శనివారం ఉప సర్పంచ్ పూర్ణ, గ్రామ పటేల్ ఆత్రం గంగారంతో కలిసి దేవుడుపల్లి ఐటీడీఏ ప్రాథమిక పాఠశాల ముందు నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. అలాగే పుల్లార గ్రామంలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ దీపాల పనులను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెడ్మ జంగుబాయి మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు వెడ్మ దత్తు, నాయకుడు పెందూర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.