మ్యాదరిపేటలో తీరని విషాదం….

మ్యాదరిపేటలో తీరని విషాదం….

దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన మ్యాదరిపేట గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.మాదాపూర్ గ్రామానికి చెందిన చల్లా లక్ష్మీ నారాయణ (45), వెల్గనూర్ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు(35) లు రోజువారీ కూలీగా మ్యాదరిపేట గ్రామంలోని ఓ దుకాణంకు వెళ్ళగా ఎదురుగా గల ఇండియన్ అయిల్ పెట్రోల్ బంక్ సంబంధించిన వ్యక్తి వచ్చి ఇనుప స్టాండ్ ను బంక్ నుండి పక్కనే గల తమ ఇంటికి తీసుకరావలే అని పిలవడంతో వెల్లి స్టాండ్ తీసుకొని వస్తుండగా పైన నుండి వెళ్తున్న 11 కెవి విద్యుత్ తీగలను గమనించిక పోవడం, స్టాండ్ ఎత్తుగా ఉండటంతో వైర్ స్టాండ్ కు తగలడంతో ఒక్కరు పూర్తిగా కాలిపోగా,మరో ఒక్కరూ అక్కడిక్కడే మరణించారు.

వీరిని కాపాడేందుకు కాసిపేట గ్రామానికి చెందిన నాగరాజు బావ గంగాధర్ టైర్లతో ప్రయత్నించగా అతనికి షాక్ రాగా చేతికి తీవ్ర గాయం అయింది.అతి కష్టం మీద అతను ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బందువులు వచ్చి తమకు న్యాయం జరిగే వవరకు మృత దేహాలను తరలించేది లేదని భీష్మించుకున్నారు‌.

విషయం తెలుసుకున్న ఎస్సై తహసీనోద్దిన్ వచ్చి మృతుల బందువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన వారు ససేమిరా అనడంతో విషయాన్ని లక్సెట్టిపేట సిఐ రమణమూర్తికి సమాచారం ఇవ్వడంతో అదనపు బలగాలతో వచ్చిన సిఐ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించిన మృతుని బందువులు బంక్ యజమానులు వచ్చి న్యాయం చేస్తేనే మృతదేహాలను తీస్తామని లేకుంటే రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు.

దీంతో ఇరు గ్రామాల పెద్ద మనుషులు బంక్ యాజమాన్యంతో మాట్లాడటంతో తగు న్యాయం చేస్తానని బంక్ యజమాని హామి ఇవ్వడం తో మృతదేహాలను పోలీసులు శవ పరీక్షకు తరలించారు.కాగా నాగరాజుకు భార్య మౌనిక,సంవత్సరం కుమారుడు ఆర్షదీపక్ ఉండగా,ప్రసుతం అతని భార్య ఆరు నెలల గర్భవతి, లక్ష్మీనారాయణకు భార్య నర్సవ్వ,పదవ తరగతి చదువుతున్న అక్షీత ఉన్నారు.

Leave a Reply