ముగిసిన గోవింద్ నాయక్ అంతక్రియలు

ముగిసిన గోవింద్ నాయక్ అంతక్రియలు

  • కుటుంబ సభ్యులను పరామర్శించించిన మాజీ మంత్రులు, తాజా ఎమ్మెల్యేలు

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ అంతక్రియలు ఆయన స్వగ్రామమైన దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో బందు,మిత్రుల అశ్రునయనాల మద్య మంగళవారం ముగిశాయి.

గోవింద్ నాయక్ మృతదేహాన్ని మాజీ మంత్రులు తాటి పర్తి జీవన్ రెడ్డి, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జీ జాన్సన్ నాయక్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మన్నలను పొందారు. ఆయన ఏ పార్టీ లో ఉన్న ప్రతి ఒక్క నాయకునితో ఆప్యాయంగా పలకరించేవారని గోవింద్ నాయక్ ఇక లేరు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మలేక పోతున్నారని అన్నారు.