విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించాలి

  • జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్

తాడ్వాయి , ఆంధ్రప్రభ : కృష్ణాజివాడి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్. శుక్రవారం కృష్ణాజివాడి పాఠశాలో తనిఖీలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 10వ తరగతి విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. పాఠశాలలో ఉన్న పదవ తరగతి విద్యార్థి మణికాంత్ అభ్యాస సామర్థ్యాలను పరిశీలించడం జరిగింది.

ఇదేవిధంగా ప్రతి విద్యార్థి విషయపరిజ్ఞానాన్ని పెంచుకొని పదవ తరగతిలో మంచి ఫలితాలను సాధించాలని సూచించడం జరిగింది. అనంతరం పాఠశాల హెచ్ఎం మరియు ఉపాధ్యాయ బృందం తో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించడానికి పలు సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామస్వామి, ఉపాధ్యాయులు గిరిమబోయి శ్వేత, సుజాత, శ్రీహరి, బాబురావు,సంధ్యారాణి, సరిత, రాజిరెడ్డి,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగు బాయ్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.