జలమయమైన శ్రీలంక కాలనీ ప్రాంతాన్ని పరిశీలించిన సీఐ..

శ్రీలంక కాలనీ చుట్టూ చేరిన నీరు..
రోడ్డుపై పారిన నీరు రాకపోకలకు ఇబ్బందులు..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలోని శ్రీలంక కాలనీ చుట్టూ నీరు చేరి జనం బయటకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న లక్షేటిపేట సీఐ రమణమూర్తి గురువారం సాయంత్రం ఆ కాలనీ పరిశీలించారు. శ్రీలంక కాలనీ చుట్టూ వరద నీరు చేయడంతో ఆ కాలనీవాసుల ఇబ్బందులను సీఐ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ ,పోలీసులు ఉన్నారు.

రోడ్డుపై పడ్డ చెట్టును తొలగించిన సీఐ..

మండలంలోని పైడిపల్లి గ్రామ సమీపాన ప్రధాన రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న భారీ వృక్షాన్ని లక్షేట్టిపేట సీఐ రమణమూర్తి స్వయంగా దగ్గరుండి కానిస్టేబుల్ చంద్రమౌళి,కూలీలచే కొమ్ములు కొట్టివేయించి తొలగించారు.ఈ సందర్భంగా సీఐని పలువురు అభినందించారు.