ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ వేగవంతం చేయాలి..
జిల్లా అదనపు కలెక్టర్ రాములు
జన్నారం, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల మ్యాపింగ్ మార్గదర్శక మార్గదర్శకాల ప్రకారం చేయాలన్నారు.
ఎస్ఐఆర్ విషయంలో ఆలసత్వం చేయకూడదని, ప్రతి అర్హుడైన ఓటరుకు ఎస్ఐఆర్ ఫామ్ ను అందజేసి, పూరించిన తర్వాత స్వీకరించాలని ఆయన తెలిపారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ బక్కయ్య, డిప్యూటీ తాహసిల్దార్ మక్సూర్ అలీ ఖాన్, ఎమ్మారై వెంకటేశం, సీనియర్ అసిస్టెంట్ సీదార్ల ఉదయ్ కుమార్, పలువురు జీపీఓలు, తదితరులు పాల్గొన్నారు.
