జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి

జైనూర్, ఆంధ్రప్రభ:
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ గోదాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గురువారం ప్రారంభించారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథ్ రావు, జైనూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్‌లతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన జొన్న ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో క్వింటాల్ జొన్నలకు మద్దతు ధర రూ. 3,699 చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో జైనూర్ సహకార సంఘం చైర్మన్ కొడప హన్ను పటేల్, ఆసిఫాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్, సర్పంచులు మడవి కౌసల్య భీమ్రావు, కుమ్ర యశోద కేశవరావు, విఠల్, ఆత్రం తులసి శంకర్ పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాలా, అబ్దుల్ ముఖీద్, జైనూర్ వ్యవసాయ అధికారి ఆనందరావు, సహకార సంఘం సీఈఓ సోన్‌కాంబ్లే జనార్దన్, పలువురు రాజకీయ నాయకులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Leave a Reply