నిలిచిన రాకపోకలు

లోలెవెల్ వంతెనపై ఉధృతంగా వరద..

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడ గ్రామం నుంచి సిరిచెల్మ గ్రామానికి వెళ్లే రహదారిపై ఉన్న లోలెవెల్ వంతెనపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా వాగులో నీటిమట్టం పెరిగి, లోలెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు వరద నీటిని దాటే ప్రయత్నం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.