శాంతియుత సమ్మె నోటీస్ అందజేత…

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఐకేపీవీఓఏ ల డిమాండ్ల పరిష్కరం కోసం రాష్ట్ర ఐకెపి విఓఏ ల జేఏసీపిలుపు మేరకు శాంతియుత నిరసన సమ్మె చేయడానికి దండేపల్లి ఐకెపి విఓఏ ల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎస్సై తహసినోద్దీన్ కు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,జీవో 58ని సవరించి గత 25 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ పరిధిలో విఓఏ లు గా పని చేస్తున్న పట్టించు కునే నాధుడే లేడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కనిసవేతనం 20వేలు కల్పిస్తూ హెచ్ ఆర్ పాలసీ అమలు చేసి సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి అర్హులైన విఓఏ లకు సిసి లు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో, విఓఏ ల సంఘం అధ్యక్షుడు బద్రి సత్యనారాయణ,సభ్యులు కొప్పుల లింగయ్య, బొలిశెట్టి అనంతలక్ష్మీ,అనురాధ, శ్రీనివాస్, మంజుల,విజయ, కనక లక్ష్మీ,సుజాత,పద్మ, భులక్ష్మీ, మంగ,రజిత,తదితరులు పాల్గొన్నారు.
