ఎటుచూసినా టీడీపీ అభివృద్దే కనిపిస్తోంది…

ఎమ్మెల్యే ప‌రిటాల‌ సునీత


రాప్తాడు, జులై 29, ఆంధ్రప్రభ : రెండేళ్లలో కేవలం 2 పథకాలకే ఒక కుటుంబానికి రూ.7.60లక్షలు,మరో కుటుంబానికి రూ.4.12లక్షలు మన టిడిపి ప్రభుత్వం అందించిందని, సంక్షేమానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని, వైసీపీ ప్రభుత్వాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రశ్నించారు? బుధవారం రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం-అభివృద్ధి- సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాప్తాడుకు వచ్చిన ఎమ్మెల్యే సునీతకు కూటమి నాయకులు, పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గురుపౌర్ణమి సంధర్భంగా ఎమ్మెల్యే సాయినాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాను దర్శించుకుని ఆలయంలో కాసేపు గడిపారు. అనంతరం బీసీ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

స్థానికంగా ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు.గుడ్లు, పౌష్టికాహారం ఎలా అందుతోందని ఆరా తీశారు. పిల్లలు ఎంత మంది ఉన్నారు.. ఎవరెవరికి ఏమి ఇస్తున్నారన్నది తెలుసుకున్నారు.ఆ తర్వాత ఇంటింటికీ కూడా రెండేళ్లలో చేసిన కార్యక్రమాలను వివరించారు.ఈ క్రమంలో రెండు కుటుంబాల వాళ్ళు తమకు అందిన పథకాల గురించి వివరించడంతో ఎమ్మెల్యే సునీత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దండు నాగేంద్రమ్మ తల్లి వట్టే రామక్క అనారోగ్యంతో వయసు రీత్యా మంచానికి పరిమితమవగా ఆమెకు ప్రతి నెల రూ.15 వేలు దండు నాగేంద్రమ్మ కుమారుడు దండు జగన్ మతిస్థిమితం లేకపోవడంతో ప్రతి నెల రూ.15 వేలు ప్రకారం ఇద్దరికీ కలిపి ఒక సంవత్సరానికి రూ.3లక్షల 60 వేలు ప్రకారం రెండేళ్లలో రూ.7లక్షల 20వేలు అందిందన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ ప్రతి సంవత్సరం రూ.20 వేలు ప్రకారం రెండేళ్లలో రూ.40వేలు ఇలా మొత్తం రూ.7.60లక్షలు లబ్ధి చేకూరిందని స్థానిక నాయకులు తెలిపారు.

అలాగే వరలక్ష్మి కుమారుడు ప్రణవ్ పుట్టుకతోనే వైకల్యంతో జన్మించగా ఆ అబ్బాయికి ప్రతి నెల రూ. 15 వేలు చొప్పున సంవత్సరానికి రూ.1లక్ష 80 వేలు ఈ రెండేళ్లలో రూ.3లక్షల 60వేలు కుటుంబంలో ఇద్దరు పిల్లలుండగా తల్లికి వందనం కింద రూ.26వేలు చొప్పున అనగా రెండేళ్లకు రూ.52 వేలు ప్రకారం మొత్తం రూ.4.12లక్షల లబ్ధి చేకూరిందన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. మేము మాటలు చెప్పమని నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. అలాగే ఇంకా అభివృద్ధిని కూడా చేస్తామని తెలిపారు. రాప్తాడు సమీపంలో జాకీ స్థానంలో రేమాండ్స్ పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. త్వరలోనే మార్కెట్ యార్డును కూడా నిర్మించనున్నట్టు చెప్పారు.

అలాగే శ్రీ పండమేరు వెంకటరమణ స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.2కోట్ల 86లక్షలు ఆత్మకూరు మండలం సనప గ్రామంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి రూ.1కోటి 14లక్షలు దేవదాయ శాఖ నుంచి మొత్తం రూ.4కోట్లు నిధులు మంజూరైనట్టు చెప్పారు.ఇందులో 20 శాతం నిధులు ఆయా దేవాలయాలనుంచి చెల్లించాల్సి ఉంటుంది. దాతలు సహకరించి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అచ్యుతానందబాబు రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు వైస్ చైర్మన్ గంగలకుంట కృష్ణ మండల టిడిపి ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు కన్వీనర్ కొండప్ప మరూరు పిఎసిఎస్ చైర్మన్ గోపాల్ నాయుడు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు వెంకటరాముడు ఎస్సీ సెల్ ముత్యాలప్ప క్లస్టర్ ఇన్చార్జిలు సోమర నారాయణస్వామి సిసి రాము ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య మాజీ సర్పంచులు తిరుపాలు బోయ నరేష్ మహిళలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.